Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #24 Translated in Telugu

لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِنْ فَوْقِهَا غُرَفٌ مَبْنِيَّةٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ الْمِيعَادَ
కాని ఎవరైతే తమ ప్రభువు యెడల భయభక్తులు కలిగి ఉన్నారో! వారి కొరకు అంతస్తుపై అంతస్తుగా, కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు
أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَلَكَهُ يَنَابِيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعًا مُخْتَلِفًا أَلْوَانُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطَامًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తున్నాడని? ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయి నపుడు, నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చి వేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది
أَفَمَنْ شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِنْ رَبِّهِ ۚ فَوَيْلٌ لِلْقَاسِيَةِ قُلُوبُهُمْ مِنْ ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُبِينٍ
ఏమీ? ఏ వ్యక్తి హృదయాన్నైతే అల్లాహ్ విధేయత (ఇస్లాం) కొరకు తెరుస్తాడో, అతడు తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తూ ఉంటాడో (అలాంటి వాడు సత్యతిరస్కారితో సమానుడు కాగలడా?) ఎవరి హృదయాలైతే అల్లాహ్ హితోపదేశం పట్ల కఠినమై పోయాయో, అలాంటి వారికి వినాశం ఉంది. అలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు
اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُتَشَابِهًا مَثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ ۚ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో, అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు
أَفَمَنْ يَتَّقِي بِوَجْهِهِ سُوءَ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَقِيلَ لِلظَّالِمِينَ ذُوقُوا مَا كُنْتُمْ تَكْسِبُونَ
ఏమీ? పునరుత్థాన దినవు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడు కోవలసిన వాడు (స్వర్గంలో ప్రవేశించేవానితో సమానుడా)? మరియు (ఆ రోజు) దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: మీరు సంపాదించిన దానిని రుచి చూడండి

Choose other languages: