Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #104 Translated in Telugu

وَمَنْ يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَنْ يَخْرُجْ مِنْ بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
وَإِذَا ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَقْصُرُوا مِنَ الصَّلَاةِ إِنْ خِفْتُمْ أَنْ يَفْتِنَكُمُ الَّذِينَ كَفَرُوا ۚ إِنَّ الْكَافِرِينَ كَانُوا لَكُمْ عَدُوًّا مُبِينًا
మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు
وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ مَعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ الَّذِينَ كَفَرُوا لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُمْ مَيْلَةً وَاحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِنْ كَانَ بِكُمْ أَذًى مِنْ مَطَرٍ أَوْ كُنْتُمْ مَرْضَىٰ أَنْ تَضَعُوا أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا حِذْرَكُمْ ۗ إِنَّ اللَّهَ أَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا مُهِينًا
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు
فَإِذَا قَضَيْتُمُ الصَّلَاةَ فَاذْكُرُوا اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا اطْمَأْنَنْتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا
ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది
وَلَا تَهِنُوا فِي ابْتِغَاءِ الْقَوْمِ ۖ إِنْ تَكُونُوا تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ اللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

Choose other languages: