Quran Apps in many lanuages:

Surah Al-Munafiqoon Ayahs #11 Translated in Telugu

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللَّهِ ۚ وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
ఓ విశ్వాసులారా! మీ సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండి నిర్లక్ష్యంలో పడవేయరాదు సుమా! ఎవరైతే ఇలా నిర్లక్ష్యంలో పడతారో అలాంటి వారే నష్టపడేవారు
وَأَنْفِقُوا مِنْ مَا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ أَحَدَكُمُ الْمَوْتُ فَيَقُولَ رَبِّ لَوْلَا أَخَّرْتَنِي إِلَىٰ أَجَلٍ قَرِيبٍ فَأَصَّدَّقَ وَأَكُنْ مِنَ الصَّالِحِينَ
మరియు మీలో ఎవరికైనా మరణ సమయం సమీపించి: ఓ నా ప్రభూ! నీవు నాకు మరి కొంత వ్యవధి ఎందుకివ్వలేదు! నేను దానధర్మాలు చేసి, సత్పురుషులలో చేరి పోయేవాడిని కదా?" అని పలికే స్థితి రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేయండి
وَلَنْ يُؤَخِّرَ اللَّهُ نَفْسًا إِذَا جَاءَ أَجَلُهَا ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
కాని ఒక వ్యక్తికి (మరణ) సమయం ఆసన్నమైనప్పుడు అల్లాహ్ అతనికి ఏ మాత్రం వ్యవధినివ్వడు. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ బాగా ఎరుగును

Choose other languages: