Quran Apps in many lanuages:

Surah Al-Mumenoon Ayahs #97 Translated in Telugu

قُلْ رَبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ
(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో
رَبِّ فَلَا تَجْعَلْنِي فِي الْقَوْمِ الظَّالِمِينَ
ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు
وَإِنَّا عَلَىٰ أَنْ نُرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ
మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము
ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ
చెడును, మంచితనముతో నివారించు. వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు
وَقُلْ رَبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ
మరియు ఇలా ప్రార్థించు: ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను

Choose other languages: