Quran Apps in many lanuages:

Surah Al-Mumenoon Ayahs #109 Translated in Telugu

أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(వారిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు): ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడలేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా
قَالُوا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّينَ
వారిలా అంటారు: ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారిగా ఉండేవారం
رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُونَ
ఓ మా ప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే
قَالَ اخْسَئُوا فِيهَا وَلَا تُكَلِّمُونِ
ఆయన (అల్లాహ్) అంటాడు: దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి
إِنَّهُ كَانَ فَرِيقٌ مِنْ عِبَادِي يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنْتَ خَيْرُ الرَّاحِمِينَ
నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు

Choose other languages: