Quran Apps in many lanuages:

Surah Al-Hijr Ayahs #63 Translated in Telugu

إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము
فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు
قَالَ إِنَّكُمْ قَوْمٌ مُنْكَرُونَ
(లూత్) అన్నాడు: నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు
قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ
వారన్నారు: కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము

Choose other languages: