Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #25 Translated in Telugu

وَلَهُمْ مَقَامِعُ مِنْ حَدِيدٍ
మరియు వారిని (శిక్షించటానికి) ఇనుప గదలు ఉంటాయి
كُلَّمَا أَرَادُوا أَنْ يَخْرُجُوا مِنْهَا مِنْ غَمٍّ أُعِيدُوا فِيهَا وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
ప్రతిసారి వారు దాని (ఆ నరకం) నుండి దాని బాధ నుండి బయట పడటానికి ప్రయత్నించి నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టబడతారు. మరియు వారితో : నరకాగ్నిని చవి చూడండి!" (అని అనబడుతుంది)
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِنْ ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ క్రింద సెలయేళ్ళు ప్రవహంచే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారికి బంగారం మరియు ముత్యాలతో చేయబడిన కంకణాలు తొడిగింప బడతాయి. అక్కడ వారి కొరకు పట్టు వస్త్రాలు ఉంటాయి
وَهُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَهُدُوا إِلَىٰ صِرَاطِ الْحَمِيدِ
ఎందుకంటే వారికి మంచి మాటల వైపునకు మార్గదర్శకత్వం చూపబడింది. మరియు వారు సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) యొక్క మార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందారు
إِنَّ الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَنْ سَبِيلِ اللَّهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ ۚ وَمَنْ يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
నిశ్చయంగా, ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తూ (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి, మస్జిద్ అల్ హరామ్ నుండి ఆటంకపరుస్తారో - దేనికైతే మేము అందరి కొరకు సమానంగా చేసి ఉన్నామో - వారు అక్కడ నివసించేవారైనా సరే, లేదా బయట నుండి వచ్చిన వారైనా సరే. మరియు ఎవరైనా దులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము

Choose other languages: