Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #106 Translated in Telugu

وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنْزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُمْ بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنْفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
మరియు వారు సులైమాన్ రాజ్య కాలమున, షైతానులు పఠించే దానిని (జాల విద్యను) అనుసరించారు. సులైమాన్ సత్యతిరస్కారి కాలేదు; కానీ నిశ్చయంగా, షైతానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగరమందు, హారూత్ మారూత్, అనే ఇద్దరు దేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పుచుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్యతిరస్కారులు కాకండి." అయినప్పటికీ వారు (ప్రజలు), భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించేది (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే, దాని ద్వారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే, కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది
وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِنْ عِنْدِ اللَّهِ خَيْرٌ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انْظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ
ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా`ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి మరియు (అతని మాటలను) శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు
مَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَنْ يُنَزَّلَ عَلَيْكُمْ مِنْ خَيْرٍ مِنْ رَبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
సత్యతిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించు కుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్రహించటంలో సర్వోత్తముడు
مَا نَنْسَخْ مِنْ آيَةٍ أَوْ نُنْسِهَا نَأْتِ بِخَيْرٍ مِنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మేము మా ప్రవచనాలలో (ఆయాత్ లలో) ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దాని కంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నీకు తెలియదా

Choose other languages: