Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #69 Translated in Telugu

فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ
వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు
لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا ۖ فَسَوْفَ يَعْلَمُونَ
ఈ విధంగా మేము వారికి ప్రసాదించిన వాటికి కృతఘ్నులై (ప్రాపంచిక) భోగభాగ్యాలలో మునిగి వుంటారు. (దాని ఫలితం) వారు మున్ముందు తెలుసు కుంటారు
أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరమ్ ను (మక్కాను) ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని! మరియు వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కోబడుతున్నారని? అయినా వారు అసత్యాన్ని నమ్మి, అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْكَافِرِينَ
మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్యతిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా
وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ
మరియు ఎవరైతే మా కొరకు హృదయపూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు

Choose other languages: