Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #73 Translated in Telugu

وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَٰكِنْ ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు
وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَنْ تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِنْ دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదలిపెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోసపుచ్చింది. ఏ వ్యక్తి గానీ తన కర్మల ఫలితంగా నాశనం చేయ బడకుండా ఉండటానికి దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్ తప్ప, అతనికి రక్షించేవాడు గానీ సిఫారసు చేసేవాడు గానీ, ఎవ్వడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటి వారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్యతిరస్కారానికి ఫలితంగా, త్రాగటానికి సలసల కాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష గలవు
قُلْ أَنَدْعُو مِنْ دُونِ اللَّهِ مَا لَا يَنْفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ముహమ్మద్!) వారితో అను: ఏమీ? అల్లాహ్ ను వదలి మాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించ లేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుదిరిగి పోవాలా? అతని వలే ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ, `మా వైపుకురా!` అంటున్నా - షైతాన్ మోసపుచ్చటం వలన - భూమిలో ఏమీ తోచకుండా, తిరుగుతాడో?" వారితో అను: నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులముగా (ముస్లింలముగా) ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము
وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
మరియు నమాజ్ ను స్థాపించమని మరియి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని కూడా. మరియు మీరంతా ఆయన (అల్లాహ్) సమక్షంలో జమ చేయబడతారు
وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُنْ فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنْفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: అయిపో!" అని అనగానే, అది అయి పోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (సూర్) ఊదబడే రోజు, సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు

Choose other languages: