Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #200 Translated in Telugu

مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ
ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము
لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِنْ عِنْدِ اللَّهِ ۗ وَمَا عِنْدَ اللَّهِ خَيْرٌ لِلْأَبْرَارِ
కాని ఎవరైతే తమ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు అల్లాహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది
وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَنْ يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنْزِلَ إِلَيْكُمْ وَمَا أُنْزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు

Choose other languages: