Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #182 Translated in Telugu

وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِأَنْفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُهِينٌ
మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే! మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది
مَا كَانَ اللَّهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنْتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَٰكِنَّ اللَّهَ يَجْتَبِي مِنْ رُسُلِهِ مَنْ يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ وَإِنْ تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ
అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది
وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ هُوَ خَيْرًا لَهُمْ ۖ بَلْ هُوَ شَرٌّ لَهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించ రాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును
لَقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنْبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ
నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము." అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేమను ఇలా అంటాము: దహించే అగ్ని శిక్షను రుచి చూడండి
ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ
ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు

Choose other languages: