Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #177 Translated in Telugu

الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
వారితో (విశ్వాసులతో) ప్రజలు: వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." అని అన్నారు
فَانْقَلَبُوا بِنِعْمَةٍ مِنَ اللَّهِ وَفَضْلٍ لَمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ
ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్నీ అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు
إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి
وَلَا يَحْزُنْكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَنْ يَضُرُّوا اللَّهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారి కెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది
إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَنْ يَضُرُّوا اللَّهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

Choose other languages: