Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayah #154 Translated in Telugu

ثُمَّ أَنْزَلَ عَلَيْكُمْ مِنْ بَعْدِ الْغَمِّ أَمَنَةً نُعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِنْكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنْفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَلْ لَنَا مِنَ الْأَمْرِ مِنْ شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنْفُسِهِمْ مَا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَا قُتِلْنَا هَاهُنَا ۗ قُلْ لَوْ كُنْتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

Choose other languages: